Verse
భయము చెందకు భక్తుడా
ఈ మాయ లోక ఛాయలు చూచినప్పుడు‖ 2x ‖
భయము చెందకు నీవు
దిగులు చెందకు నీవు‖ 2x ‖
జీవమిచ్చిన యెహొవున్నాడు
ఓ భక్తుడా.. ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు‖ భయము ‖
Verse
బబులోను దేశమందున
ఆ భక్తులు ముగ్గురు.. బొమ్మకు మ్రొక్కనందునా‖ 2x ‖
పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే‖ 2x ‖
నాల్గవ వాడు ఉండలేదా
ఓ భక్తుడా.. నాల్గవ వాడు ఉండలేదా‖ భయము ‖
Verse
చెరసాలలో వేసినా
తన దేహమంతా.. గాయాలతో నిండినా‖ 2x ‖
పాడి కీర్తించి పౌలు సీలలు కొనియాడ‖ 2x ‖
భూకంపం కలుగ లేదా
ఆ భక్తులు ముగ్గురు.. చెరనుండి విడుదల కాలేదా‖ భయము ‖
Verse
ఆస్తి అంతా పోయినా
తన దేహమంతా.. కురుపులతో నిండినా‖ 2x ‖
అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయె‖ 2x ‖
అని యోబు పలుక లేదా
ఓ భక్తుడా.. అని యోబు పలుక లేదా‖ భయము ‖