Chorus
భయము లేదుగా మనకు భయము లేదుగా
దయగల మన దేవుడుండ భయము లేదుగా
Verse
క్షామ మరణ యుద్ధ ఖడ్గ బలము నుండియు
ధరణి గిరులు అదరి సముద్రములు పొంగిన
పరిశుద్ధుడు యేసుడే నిత్యము కాపాడు గనుక
Verse
అపవాది తంత్రములపై విజయమిచ్చును
అభయమిచ్చి క్షేమముగా ఆదరించును
అక్షయుడగు యేసుడే నిత్యము కాపాడు గనుక
Verse
దివారాత్రులు దేవుడు ధైర్యపరచును
ఈ కాలపు శ్రమలే మనల మార్చు మహిమకు
నిర్మలుడగు యేసుడే నిత్యము కాపాడు గనుక
Verse
శ్రమలు దుఃఖ బాధలెన్నో మనకు సోకిన
ఏకీడు తగులకుండ కాయుశక్తితో
శక్తిమంతుడు యేసుడే నిత్యము కాపాడు గనుక
Verse
పాడెదము మన ప్రభునకే హృదయ గీతము
మహిమరాజు మనకొరకై తిరిగి వచ్చును
మన ప్రభువగు యేసుడే నిత్యము కాపాడు గనుక