Verse
భయము లేదు మనకు ఇకపై ఎదురు వచ్చు గెలుపు
అదిగో యేసు పిలుపు
వినుమా పరము చేరు వరకు‖ 2x ‖
ఫలితమేదైన ప్రభును వీడకు
కష్టమెంతైన కలత చెందకు
అలుపు లేకుండ పరుగు సాగని
శోధనలు నిన్ను చూసి బెదరని‖ భయము ‖
Verse
సంధించిన బాణమల్లె నీ గురి కొనసాగని
మన తండ్రి వాగ్ధానాలే ఊపిరిగా మారని‖ 2x ‖
కష్టాలే మెట్లుగా మారి యేసులో ఎదిగించని
తన వాక్యం నీలో వెలిగి చీకటి తొలగించని‖ 2x ఫలిత ‖
Verse
మండించే అగ్గితోనే మెరయును బంగారము
శోధనల కొలిమిలోనే బలపడు విశ్వాసము‖ 2x ‖
నీ తరపున యుద్ధం చేసే యెహోవా నీ అండ
తొలగిపోకు ఆ మార్గన్నీ తన ఆజ్ఞను వినకుండా‖ 2x ఫలిత ‖
Verse
కనలేదా సిలువలోన యేసు రాజు కష్టము
తానొందిన శ్రమల ద్వారా నశియించే పాపము‖ 2x ‖
నీ శ్రమల కాలంలోనే మనసు దృఢము కావాలి
తిరిగి నీలో పుట్టే పాపం బీజము నశియించాలి‖ 2x ఫలిత ‖
Verse
ప్రియమైన పుత్రుని మనకై నలిగించిన దేవుడు
అప్పగించలేడా సకలం సర్వశక్తిమంతుడు‖ 2x ‖
తన సన్నిధి రావాలంటూ నిన్ను కోరుతున్నాడు
నీతి నీలో పెంచేటందుకు తపన పడుతూ ఉన్నాడు‖ 2x ఫలిత ‖