Chorus
భయము నొందకుము క్రైస్తవ సహోదర యింక భయము నొంద
కుము భయము నొందకుము హృదయ వాసుఁడగు క్రీస్తు దయ నీ
తలఁపు లెల్ల రయముగ నెరవేర్చు‖ భయము ‖
Verse
దీవింపఁబడెడు జగమున కిరుకౌ త్రోవ జను నపుడు భావ జ్ఞానము
వీడ భయపుఁ జీఁకటి గూడుఁ గావున మది యేసు భావింప గతి జేర్చు‖ భయము ‖
Verse
నీ యాత్మఁ జూచి కయ్యము జేయ డాయు పిశాచి యా యుద్ధమున
బ్రత్య య మ్మనెడు డాల్బట్ట నా యెడఁ గ్రీస్తు స హాయుఁడై గెల్పించు‖ భయము ‖
Verse
జగము నిన్బట్టి వెన్కకు నీడ్చి పగఁ దీరఁ గట్టి యెగతాళి గావించు
టెఱింగి క్రీస్తుని పిల్వఁ డగఁబట్టు మపుడు నీ పగ మాన్పి విడిపించు‖ భయము ‖
Verse
కలుష జాలంబు మాయా కీట కముల జాలంబు గల బావి నీ
యాత్మ గలియకుండఁగ యేసుఁ దలఁచు మప్పుడు నిం జే తంబట్టి
కాపాడు‖ భయము ‖
Verse
శ్రమ దండనముల శిశు శిక్షించు జనకు విధముల సమకూర్చు నీ
దేవుఁ డమిత ప్రేమను గాంచి యమలమౌ మతి నోర్చు మపుడు
మేలిడు నీకు‖ భయము ‖
Verse
కన నీదు చటుల దుఃఖాదు లె ట్లను వీడు నటులఁ గొన దినమున
న్యాయ మును దీర్పఁగాఁ క్రీస్తు చను దెంచి నిత్య జీ వన కిరీటము
నిచ్చు‖ భయము ‖