Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Bhayapadaku Bhayapadaku Nee Payanam Saaginchu

భయపడకు భయపడకు నీ పయనం సాగించు

Bhayapadaku Bhayapadaku Nee Payanam Saaginchu

Lyricist: Akumarthi Daniel
Chorus
భయపడకు భయపడకు నీ పయనం సాగించు
నీతోడు యేసు నడచును ఇది నిజము‖ 2x ‖
Verse
కోడి తన పిల్లలను రెక్కలతో కాచు రీతి
యేసయ్య తన బాహువులో నిన్నునూ దాచును
నీ ఎండ వేళలో మేఘమై నిలుచును యేసు‖ 2x ‖
నీవు చలికి వణకు నపుడు అగ్నిగా కాపాడున్
Verse
గర్జించు సింహములా సాతాను పొంచివున్నను
యూదా గోత్రపు సింహమై ప్రభు నిన్ను కాచును
అగ్నిలోబడి వెళ్ళినను జ్వాల నిను కాల్చదు‖ 2x ‖
వాగ్ధానమిచ్చిన యేసు నెరవేర్చుదేవుడు

Related Tags

FaithEncouragementProtection