Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Bhayapadakumu Neevu Yuddhamu Yehovade

భయపడకుము నీవు యుద్ధము యెహోవదే

Bhayapadakumu Neevu Yuddhamu Yehovade

Chorus
భయపడకుము నీవు - యుద్ధము యెహోవదే
నిశ్చయముగ జయము - నీదే భయపడకుము
Verse
గర్జించు సింహమువలె శత్రువు - నీపైని బడ జూచుచుండె
నదివలె నీపై పారవచ్చును - యుద్ధము యెహోవదే భయపడకు‖ భయపడకు ‖
Verse
పాలు తేనెలు ప్రవహించెడు - కానాను మీయెదుట నుండె
శత్రువు నిన్ను జంపజూచె - యుద్ధము యెహోవదే భయపడకు‖ భయపడకు ‖
Verse
నీకు విరోధముగ రూపించు - యే ఆయుధము వర్ధిల్లదు
ప్రతి నాలుక తీర్పుకు లోనగును - యుద్ధము యెహోవదే భయపడకు‖ భయపడకు ‖
Verse
ఇహపరమునందు మన ప్రభువునకు - సర్వాధికారము నియ్యబడెను
ఆయన సన్నిధి నీతో యుండును - యుద్ధము యెహోవదే భయపడకు‖ భయపడకు ‖
Verse
నీవు పోరాడెడు పనిలేదు - నమ్మకముంచి విశ్వాసముతో
రక్షణను తిలకించుము - జయము ప్రభువుదే భయపడకు‖ భయపడకు ‖

Related Tags

FaithSpiritual WarfareVictoryCourage