Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Bhayapadakumu O Chinna Manda Dayagala Mee Thandri Piluchuchunnadu

భయపడకుము ఓ చిన్న మందా దయగల మీ తండ్రి పిలుచుచున్నాడు

Bhayapadakumu O Chinna Manda Dayagala Mee Thandri Piluchuchunnadu

Chorus
భయపడకుము ఓ చిన్న మందా
దయగల మీ తండ్రి పిలుచుచున్నాడు
Verse
తన రాజ్యమంత నీ కీయగోరి
ఉన్నత పిలుపు నీకు నిచ్చెను
తనరక్తమిచ్చి నిన్ను కొన్నాడు
Verse
దేవుని రాజ్య మహిమను బొంద
సువార్త ద్వారా నిన్ను పిలిచెను
నీవు నడువుము తగినట్లు ప్రభుకు
Verse
పరిశుద్ధులలో పాత్రునిచేయ
పరలోక పిలుపు నీకు నిచ్చెను
ప్రభుని స్వాస్థ్యమును నీ కిచ్చున్
Verse
అక్షయ నిర్మల వాడబారని
రక్షణ స్వాస్థ్యము భద్రపరచి
నిశ్చయముగా నిన్ను పిలిచెను
Verse
తన కుమారుని నీ కొరకీయ
వెనుదీయలేదు నీ ప్రియతండ్రి
తన స్వాస్థ్యమంత నీ కొర కిచ్చున్
Verse
ప్రైశుద్ధాత్మలో నిను శుద్ధిజేసి
పరిశుద్ధుల స్వాస్థ్యము నీ కీయ
తెరువ జేసెను నీ కన్నులను
Verse
సిలువలో యేసు చనిపోయి బ్రతికె
గెలిచె సమాధి బలమీయ నీకు
హల్లెలూయ యని పాడుము నీవు

Related Tags

FaithEncouragementGods Love