Chorus
భీకరుండౌ మా యెహోవా పీఠ మెదుటం గూడరే యేకమై
సాష్టాంగపడి సర్వేశ్వరుని గొనియాడరే‖ భీకరుండౌ ‖
Verse
మట్టితోనే మమ్ము నెల్ల మానవులుగ సృజించెను ఇట్టి శక్తుండౌ ప్రభు
న్మే మెచ్చుగా మది నెంతుము‖ భీకరుండౌ ‖
Verse
ఏరితోడు లేక మము సర్వేశ్వరుఁడు సృష్టించెను ధారుణిం దా
నొక్కఁడే మా దైవమని పూజింతుము‖ భీకరుండౌ ‖
Verse
పుట్టగిట్టంజేయఁదానై నట్టి దేవుని శక్తిని బట్టుగా లోకస్థులారా
ప్రస్తుతింపరె భక్తిని‖ భీకరుండౌ ‖
Verse
మేటి సంగీతంబులుపై మింట నారవ మొందను జాటరే వేవేల
నోళ్ళన్ సన్నుతుల్ ప్రభు వందను‖ భీకరుండౌ ‖
Verse
మిక్కిలి కష్టంబులతో మిత్తికిని బాల్పొందను దిక్కులేని గొఱ్ఱె
లట్లుఁ దిరుగఁజేర్పన్ మందను‖ భీకరుండౌ ‖