Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Bheekarundau Maa Yehovaa Peeta Medutan Goodare

భీకరుండౌ మా యెహోవా – పీఠ మెదుటన్ గూడరే

Bheekarundau Maa Yehovaa Peeta Medutan Goodare

Verse
భీకరుండౌ మా యెహోవా – పీఠ మెదుటన్ గూడరే
ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని గొనియాడరే‖ భీకరుండౌ ‖
Verse
మట్టితోనే మమ్ము నెల్ల – మానవులుగ సృజించెను
ఇట్టి శక్తుండౌ ప్రభున్ మే-మెచ్చుగా మది నెంతుము‖ భీకరుండౌ ‖
Verse
ఏరితోడు లేక మము స-ర్వేశ్వరుడు సృష్టించెను
ధారుణిన్ దానొక్కడే మా – దైవమని పూజింతుము‖ భీకరుండౌ ‖
Verse
పుట్టగిట్టన్ జేయ దానై – నట్టి దేవుని శక్తిని
బట్టుగా లోకస్తులారా – ప్రస్తుతింపరే భక్తిని‖ భీకరుండౌ ‖
Verse
మేటి సంగీతంబులపై – మింట నారవ మొందను
జాటరే వేవేల నోళ్ళన్ – సన్నుతుల్ ప్రభు వందను‖ భీకరుండౌ ‖
Verse
మిక్కిలి కష్టంబులతో – మిత్తికిని బాల్పొందను
దిక్కు లేని గొర్రెలట్లు – దిరుగ జేర్పన్ మందను‖ భీకరుండౌ ‖

Related Tags

PraiseWorshipGod