Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Bhoodhigantha Nivaasulaaraa Naedae Rakshana Pondhandi

భూదిగంత నివాసులారా నేడే రక్షణ పొందండి

Bhoodhigantha Nivaasulaaraa Naedae Rakshana Pondhandi

Chorus
భూదిగంత నివాసులారా - నేడే రక్షణ పొందండి‖ 2x ‖
ఇదియే సమయము - యుగ సమాప్తి కాలము‖ 2x ‖
నేడే యేసుని చేరుడి - హల్లెలూయ గానము చేయుడి‖ 2x ‖
Verse
చీకటిలో ఉన్నవారికి - వెలుగును చూపించును
చెరలోనున్న వారికి - విడుదల దయచేయును‖ 2x ‖
మూగవారికి - మాటలు దయచేయును- గ్రుడ్డివారు - చూపు పొందుదురు
తన నామమున - రక్షణ దయచేయును‖ 2x ఇదియే ‖
Verse
లోబడనొల్లని వారలకు - దినమెల్ల చేతులు చాచును
తనను వెదకని వారికి - ఉచితముగా దొరుకును‖ 2x ‖
మన పాపములు - తలకు మించినవై యున్నవి-
మన దోషములు - ఆకాశమంత ఎత్తుగా నున్నవి
మన కొరకు సిలువలో - మరణించి లేచెను‖ 2x ఇదియే ‖

Related Tags

GospelRepentanceSalvation