Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Bhoomandalamu daani sampoornatha yunu lo

భూమండలము దాని సంపూర్ణత యును లో

Bhoomandalamu daani sampoornatha yunu lo

Lyricist: Mallela David
Chorus
భూమండలము దాని సంపూర్ణత యును లోకమును
భూమండల వాసులను బొల్పార యెహోవావే‖ భూ ‖
Verse
యెహోవ సంద్రము మీఁద భుమి పునాది వేసె
మహాజలమూల మీఁద మనదేవుఁడది స్థిరపర్చె‖ భూ ‖
Verse
యెహోవ పర్వతమునకు నెక్కంగఁ బాత్రుడెవఁడు
మహాలయంబునందు మరి నిల్వ యోగ్యుం డెవఁడు‖ భూ ‖
Verse
అపవిత్ర మనసులేక కపట ప్రమాణము లేక
సుపవిత్రమౌ చేతులను శుద్ధాత్మ గల్గినవాఁడే‖ భూ ‖
Verse
ఆలాటి వాఁడు ప్రభుని యాశీర్వచనము నొందు
భులోకమున రక్షణ దేవుని నీతి మత్వముపొందు‖ భూ ‖
Verse
ప్రభునాశ్ర యించు నట్టి వారు యాకోబు దేవ
ప్రభుసన్నిధానము వెదకు ప్రజలెల్ల రట్టివారే‖ భూ ‖
Verse
ద్వారంబు లార యింక మీ తల లెల్లబైకెత్త వలెన్
రారాజు కొరకుఁతలుపులాలా మిమ్మెత్తుకొనుఁడి‖ భూ ‖
Verse
ఇలలో మహా మహిమంబు గలిగిన యీ రాజెవఁడు
బలశౌర్యముల యెహోవ బహుశూరుడౌ యెహోవ‖ భూ ‖

Related Tags

WorshipHolinessCreation