Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Bhoomiyu Daani Sampoornatha

భూమియు దాని సంపూర్ణత

Bhoomiyu Daani Sampoornatha

Lyricist: Songs Of Zion
Verse
భూమియు దాని సంపూర్ణత లోకము
దాని నివాసు లెహోవావే‖ 2x ‖
Verse
ఆయన సముద్రము మీద దానికి పునాది వేసెను‖ 2x ‖
ప్రవాహజలముల మీద దానిని స్థిరపరచెను‖ 2x భూమియు ‖
Verse
యెహోవా పర్వతమునకు నెక్కదగిన వాడెవ్వడు‖ 2x ‖
యెహోవా పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవ్వడు‖ 2x భూమియు ‖
Verse
వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు‖ 2x ‖
నిర్దోషచేతులు శుద్ధ హృదయము కలిగినవాడే‖ 2x భూమియు ‖
Verse
నిన్నాశ్రయించి నీ సన్నిధిని వెదకెడి వాడు‖ 2x ‖
వాడాశీర్వాదము నీతి మత్వము నొందును‖ 2x భూమియు ‖
Verse
గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి పురాతనమైన తలుపులారా‖ 2x ‖
మహిమగల రాజు ప్రవేశించునట్లు మిమ్మును లేవనెత్తికొనుడి‖ 2x భూమియు ‖
Verse
మహిమగల యీ రాజెవడు? బలశౌర్యముగల ప్రభువే‖ 2x ‖
యుద్ధశూరుడైన యెహోవా పరాక్రమముగల ప్రభువే‖ 2x భూమియు ‖
Verse
మహిమగల యీ రాజెవడు? సైన్యముల యెహోవాయే‖ 2x ‖
ఆయనే యీ మహిమగల రాజు హల్లెలూయా ఆమెన్‖ 2x భూమియు ‖

Related Tags

PraiseWorshipCreation