Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Bhoomyaakaashamulu Srujinchina

భూమ్యాకాశములు సృజించిన

Bhoomyaakaashamulu Srujinchina

Verse
భూమ్యాకాశములు సృజించిన
యేసయ్యా నీకే స్తోత్రం‖ 2x ‖
నీ ఆశ్ఛర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును‖ 2x ‖
హల్లెలూయ లూయ హల్లెలూయా‖ 4x ‖
Verse
బానిసత్వమునుండి శ్రమల బారినుండి విడిపించావు నన్ను
దీన దశలో నేనుండగా నను విడువవైతివి‖ 2x భూమ్యాకాశములు ‖
Verse
జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను
ఆకలితో అల్లాడగా నను తృప్తిపరచితివి‖ 2x భూమ్యాకాశములు ‖
Verse
భుజంగములను అణచివేసి కాచినావు నన్ను
ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి‖ 2x భూమ్యాకాశములు ‖
Verse
నూతన యెరూషలేం నిత్యనివాసమని తెలియజేసితివి
నిట్టూర్పులలో ఉండగా నను ఉజ్జీవ పరచితివి‖ 2x భూమ్యాకాశములు ‖

Related Tags

PraiseWorshipThanksgiving