Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Bhoopunaadi Munupe

భూపునాది మునుపే

Bhoopunaadi Munupe

Lyricist: George Sambathini
Verse
భూపునాది మునుపే – ఈ లోక సృష్టి ముందే
ఆనంద ధ్వనులు చేసి – పాడిరి ఉదయ నక్షత్రాలు
కొలతలేసినప్పుడే – ద్వారాలు తెరచినప్పుడే
ఆనంద ధ్వనులు చేసి – పాడిరి దేవుని కుమారులు
నూతనాకాశము.. నూతన లోకము…
నూతనెరుషలేము వచ్చును
దేవుడే మనతో.. గుడారమై యుండును…
మనమంతా మరలా పాడెదము‖ భూపునాది ‖
Verse
జీవమే జీవమే – ప్రాణమే ప్రాణమే
నిత్యము మనలో ఉందును‖ 2x ‖
తండ్రి క్రీస్తుయు – పరిశుద్ధాత్ముడు
మనతో ఏకమై యుండును‖ భూపునాది ‖
Verse
వేదన బాధయు – కన్నీరు దుఃఖము
ఇంకెక్కడా ఉండే ఉండవు‖ 2x ‖
సూర్య చంద్రులు – వెలుగును ఇవ్వవు
దేవుడే వెలుగై యుండును‖ భూపునాది ‖

Related Tags

HopeEternityCreationNew Jerusalem