Verse
భూమియు దాని సంపూర్ణత లోకము
దాని నివాసు లెహోవావే
Verse
ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను
ప్రవాహజలముల మీద దానిని స్థిరపరచెను
Verse
యెహోవా పర్వతమునకు నెక్కదగిన వాడెవ్వడు
యెహోవా పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవ్వడు
Verse
వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు
నిర్దోషచేతులు శుద్ధ హృదయము కలిగినవాడే
Verse
నిన్నాశ్రయించి నీ సన్నిధిని - వెదకెడివాడు
వాడాశీర్వాదము నీతి - మత్వము నొందును
Verse
గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి పురాతనమైన తలుపులారా
మహిమగల రాజు ప్రవేశించునట్లు మిమ్మును లేవనెత్తికొనుడి
Verse
మహిమగల యీ రాజెవడు? బలశౌర్యముగల ప్రభువే
యుద్ధశూరుడైన యెహోవా పరాక్రమముగల ప్రభువే
Verse
మహిమగల యీ రాజెవడు? సైన్యముల యెహోవాయే
ఆయనే యీ మహిమగల రాజు హల్లెలూయా ఆమెన్