Verse
భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం
నీ ఆశ్చ్యర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును
హల్లెలూయ… లూయ… హల్లెలూయ‖ 4x ‖
Verse
బానిసత్వమునుండి, శ్రమలబారినుండి, విడిపించావు నన్ను
దీన దశలో నేనుండగా, నను విడువనైతివి‖ 2x భూమ్యా ‖
Verse
జీవాహారమై, నీదువాక్యము, పోషించెను నన్ను
ఆకలితో అల్లాడగా, నను తృప్తిపరచితివి‖ 2x భూమ్యా ‖
Verse
భుజంగములను, అణచివేసి, కాచినావు నన్ను
ఆపదలో చిక్కుకొనగా, నను లేవనెత్తితివి‖ 2x భూమ్యా ‖
Verse
నూతన యెరూషలేమ్, నిత్య నివాసమని, తెలియజేసితివి
నిట్టూర్పులలో వుండగా, నను ఉజ్జీవపరచితివి‖ 2x భూమ్యా ‖