Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Brathakaalani unnaa brathakalekunnaa

బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా

Brathakaalani unnaa brathakalekunnaa

Verse
బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా
నిలవాలని ఉన్నా నిలవలేకున్నా‖ 2x బ్రతకాలని ‖
చూడాలని ఉన్నా చూడలేకున్నా
చేరాలని ఉన్నా నిను చేరలేకున్నా
బ్రతికించుమో యేసయ్యా
దరి చేర్చుమో నన్నయ్యా‖ 2x బ్రతకాలని ‖
Verse
కాపరి లేని గొర్రెనైతి
కాటికి నే చేరువైతి
కావలి లేని తోటనైతి
కారడవిగా నే మారితి
గూడు చెదరిన గువ్వనైతి
గుండె పగిలిన ఎకాకినైతి
గుండె దిగులుగా ఉందయ్యా
గూడు చేర్చుమో యేసయ్యా‖ 2x బ్రతకాలని ‖
Verse
నా ఆశలే అడియాశలై
అడుగంటెనే నా జీవితం
శోధనల సుడివడిలో
తొట్రిల్లెనే నా పయనం
చుక్కాని లేని నావనైతి
గమ్యం తెలియక అల్లాడుచుంటి
గురి చేర్చుమో యేసయ్యా
గుండె గుడిలో నీవుండయ్యా‖ 2x బ్రతకాలని ‖

Related Tags

PrayerComfortSurrender