Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Brathikeda Nee Kosame

బ్రతికెద నీ కోసమే

Brathikeda Nee Kosame

Lyricist: Raj Prakash Paul
Verse
బ్రతికెద నీ కోసమే
నా ఊపిరి నీ ధ్యానమే
నా జీవితమే నీకంకితమై‖ 2x ‖
నీదు సేవ జేతు పుణ్యమాని భావింతు
నేను చివర శ్వాస వరకు‖ బ్రతికెద ‖
Verse
శ్రమయును బాధయు నాకు కలిగినా
వైరులు ఎల్లరు నన్ను చుట్టినా
నీదు న్యాయ శాసనమునే పాటింతు‖ 2x ‖
నాలోని బలము నన్ను విడిచినా
నా కన్ను దృష్టి తప్పిపోయినా‖ 2x ‖
నిన్ను చేరి నీదు శక్తి పొంద
నీదు ఆత్మ తోడ లోక రక్షకా‖ బ్రతికెద ‖
Verse
వాక్యమే మ్రోగుట విశ్వాసము వెల్లడి చేయుట
ఇహమందున యోగ్యమైన కార్యముగా నే తలచి‖ 2x ‖
నీదు రుధిరంబు చేత నేను
కడగబడిన నీదు సొత్తు కాదా‖ 2x ‖
నిన్ను జూప లోకంబులోన
నీదు వెలుగు దీపముగా నాథా‖ బ్రతికెద ‖

Related Tags

WorshipCommitmentDevotion