Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Brathikeda Nee Kosame Naa Dhyaname

బ్రతికెద నీ కోసమే నా ధ్యానమే

Brathikeda Nee Kosame Naa Dhyaname

Lyricist: Raj Prakash Paul
Chorus
బ్రతికెద నీ కోసమే నా ధ్యానమే
నా జీవితమే నీ కంకితమై
నీదు సేవజేతు పుణ్యమని భావింతు నేను చివరి శ్వాస వరకు
బ్రతికెద నీ కోసమే (స్వామీ) బ్రతికెద నీ కోసమే‖ స్వామీ ‖
Verse
శ్రమయును బాధయు నాకు కలిగిన వైరులు ఎల్లరు నన్ను చుట్టినా
నీదు న్యాయ శాసనమునే పాటింతు
నాలోని బలము నన్ను విడచినా నా కన్నుదృష్టి తప్పిపోయినా
నిన్ను చేరి నీదు శక్తి పొంది నీదు ఆత్మతోడ లోక రక్షకా
Verse
వాక్యమే మ్రోగుట విశ్వాసము వెల్లడి చేయుట
ఇహమందును యోగ్యమైన కార్యముగా నే తలచి
నీదు రుధిరంబు చేత నేను కడగబడిన నీదు సొత్తు కాదా
నిన్ను జూప లోకంబులోన నీదు వెలుగు దీపముగా నాధా

Related Tags

WorshipDevotionalDedication