Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Brathikiyunnaanante Nee Krupa

బ్రతికియున్నానంటే నీ కృప

Brathikiyunnaanante Nee Krupa

Verse
యేసయ్యా నా యేసయ్యా…
యేసయ్యా నా యేసయ్యా…
బ్రతికియున్నానంటే నీ కృప
జీవిస్తున్నానంటే నీ కృప‖ 2x ‖
ఏ యోగ్యత నాలో లేదు – ఎంత భాగ్యము నిచ్చావు
పరిశుద్ధత నాలో లేదు – నీ ప్రేమను చూపావు‖ 2x ‖
యేసయ్యా నా యేసయ్యా
యేసయ్యా నా యేసయ్యా‖ 2x ‖
Verse
నా జీవిత నావా సాగుచుండగా
తుఫానులు వరదలు విసిరి కొట్టగా
కదలలేక నా కథ ముగించబోగా
నువ్వు పదా అంటూ నన్ను నడిపినావు‖ 2x ‖
సదా నిన్నే సేవిస్తూ సాగిపోయేదా
నీ పాదాల చెంతనే వాలిపోయేదా‖ 2x యేసయ్యా ‖
Verse
నా జీవితమంతా ప్రయాసలు పడగా
శోధనల సంద్రములో మునిగిపోగా
నా ఆశల తీరం అడుగంటిపోగా
ఆప్యాయత చూపి ఆదరించినావు‖ 2x ‖
నీ కృపతోనే నా బ్రతుకు ధన్యమైనది
నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా‖ 2x బ్రతికి ‖

Related Tags

WorshipThanksgivingGrace