Verse 1
మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా
మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము (2)
మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా
నీవంటి వారు ఎవరు – నీవంటి వారు లేరు (2)
Verse 2
స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెదం
నీ నామమెంతో గొప్పది మేమారాధింతుము (2) ||మహోన్నతుడా||
Verse 3
అద్వితీయ దేవుడా ఆది సంభూతుడా
మా కరములను జోడించి మేము మహిమ పరచెదం (2) ||మహోన్నతుడా||