Verse 1
నా నోటన్ క్రొత్తపాట - నా యేసు ఇచ్చెను
ఆనందించెదను - ఆయననే పాడెదన్
జీవితకాలమంత - హల్లెలూయ...
Verse 2
పాపపు బురదనుండి లేవనెత్తెను
జీవ మార్గమున నన్ను - నిలువబెట్టెను ||ఆనం ||
Verse 3
తల్లితండ్రి బంధుమిత్ర - జీవమాయనే
నిందను భరించి ఆయన మహిమన్ చాటెదన్ ||ఆనం ||
Verse 4
వ్యాధి బాధలందు నన్ను - ఆదుకొనెను
కష్టములన్ని తొలగించి - శుద్ధికరించెను ||ఆనం ||
Verse 5
ఇహలోకశ్రమలు - నన్నేమి చేయును
పరలోక జీవితమునే - వాంఛించెదను ||ఆనం ||