Verse 1
ఈ మహిలో శాశ్వతం ఏదీ లేదు సోదరా
ఎందుకింక దీనిపై ఆశ వీడరా ఆశ వీడరా
లోక రక్షణార్ధమై ప్రాణమర్పించిన
క్రీస్తు నందె మోక్ష పురికి దారి కలదురా - 2 || ఈ మహిలో ||
Verse 2
అంతలో కనబడి మాయమౌ ఆవిరి
నీటి బుడగనీదు బ్రతుకు కానరా
ఏ క్షణమో ఈ ఘటం పగిలిపోవు నేస్తం
మరుక్షణమే విడిచెదవు నీకున్న సమస్తం ||ఈ మహిలో ||
Verse 3
నీట ముంచి లేపిన చేద వెంట జారిన
నీటి బిందువే నీవు ఎరుగరా
త్రాసుమీద ధూళివి తిరిగిరాని వాడివి
లోకమందు కేవలం యాత్రికుడివి ||ఈ మహిలో ||
Verse 4
ఎగిరిపోవు పొగవలె తరిగిపోవు దినములు
సాలె పురుగు గూడు నీది చూడరా - 2
ఓటికుండ జీవితం దాటిపోవు నీడవు
పరలోకమె (నీ) మనదేశం అదే శాశ్వతం ||ఈ మహిలో ||