Verse 1
నిరాశపడకుమా నేస్తమా - నిరీక్షనెన్నడు విడువకుమా - 2
లోకము వైపు చూడకుమా - యేసే నీ గురి మరువకుమా - 2 || నిరాశ ||
Verse 2
నీటిపై నడచిన నిజమైన దేవుడు
నరునికి తనవలె అధికార మీయ - 2
అటు ఇటు చూసి అలలకు జడిసి
మునిగిన పేతురును మరువకుమా - 2 ||నిరాశ ||
Verse 3
సృష్టిని చేసిన సత్య స్వరూపి
అపవాది సేనపై అధికారమీయ - 2
ప్రార్ధన కరువై విశ్వాసమల్పమై
ఓడిన శిష్యులను మరువకుమా - 2 ||నిరాశ ||