Verse 1
శాశ్వతమైనది నా యేసుని ప్రేమ
నిరంతరమున్నది నిజదేవుని ప్రేమ
యేసుని ప్రేమ నా యేసుని ప్రేమ
Verse 2
మరణపు లోయలో నను కాచినది
నా శ్రమలో నను ఓదార్చినది
నను వీడనిది యెడబాయనిది
మారనిది మధురమైనది - 2 ||శాశ్వత ||
Verse 3
నా పాపములను భరియించినది
నాకై శ్రమలను సహించినది
నాకు మారుగా మరణించినది
నను జీవముతో బ్రతికించినది - 2 ||శాశ్వత ||
Verse 4
మత్సరపడనిది డంబము లేనిది
మరణమంత బలమైనది
దయచూపునది సహించునది
అన్నింటిలో శ్రేష్టమైనది - 2 ||శాశ్వత ||