నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్
నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ (2)
అంతా నా మేలుకే – ఆరాధన యేసుకే
అంతా నా మంచికే – తన చిత్తమునకు తల వంచితే
తన చిత్తమునకు తల వంచితే
ఆరాధన ఆపను – స్తుతియించుట మానను (2)
స్తుతియించుట మానను
కన్నీళ్లే పానములైనా – కఠిన దుఃఖ బాధలైనా
స్థితి గతులే మారినా – అవకాశం చేజారినా (2)
మారదు యేసు ప్రేమ – నిత్యుడైన తండ్రి ప్రేమ (2)
మారదు యేసు ప్రేమ – నిత్యుడైన తండ్రి ప్రేమ (2) ||అంతా||