Verse 1
జుంటె తేనె ధారలకన్న మధురమైనది - మంచి ముత్యాలకన్న విలువైనది - 2
పర్వతాలు తొలగినా తొలగిపోని ప్రేమ - 2
శాశ్వతకాలం నిను ప్రేమించు ప్రేమ - 2
Verse 2
బంధువులకన్న బహు విలువైన ప్రేమా
స్నేహితుల కన్న మరి శ్రేష్టమైన ప్రేమా - 2
బలమైన ప్రేమ నిన్ను వీడని ప్రేమ - 2 ||సిలువ ||
Verse 3
ధన ధాన్యలకన్న ధన్యమైన ప్రేమా
రత్నరాసులకన్న రమ్యమైన ప్రేమా
విలువైన ప్రేమ రక్తమిచ్చిన ప్రేమా - 2 ||సిలువ ||
Verse 4
సిలువప్రేమా కలువరి ప్రేమా - 2