Verse 1
మరనాత దర్శనం మానవాళికి మహోదయం
ప్రేమ-త్యాగం సేవా - సహనం దేవుని కోసం - దేశం కోసం
మరనాత దర్శనం మహిమ నాధుని దర్శనం - 2
Verse 2
విశ్వ మంతటిలో వినూత్నమైన విప్లవం
ఆధ్యాత్మిక అంధులలో నైతిక సంచలనం
మ్లానమైన ప్రతి హృదిలో జీవనదీ ప్రవాహం
పథము విడిన పాంథులకు మార్గదర్శకం ||మరనాత ||
Verse 3
మమతెరుగని మనసుకు ఆదరణ సాధనం
ఎన్నున్నా కృంగుతున్న బ్రతుకులకు నవోదయం
భ్రమపడే యువతకు త్యాగప్రేమ స్వరూపం
తృప్తి పరచు భక్తితో ముక్తి దర్శనం ||మరనాత ||