Verse 1
భయములేదు - దిగులు లేదు - జీవితయాత్రలో || 2 ||
యేసుప్రభువు - మనతోనుండ - భయములేదుగా - హల్లెలూయ - హల్లెలూయ
Verse 2
గాలి తుఫాను రేగి అలలు పొంగిన - విశ్వాస నావ మునగ కొట్టబడిన
సముద్రము పొంగి - నురుగు కట్టిన
యేసుప్రభువు మనతోనుండ - భయములేదుగా - 2 ||భయము ||
Verse 3
వ్యాధి బాధలు నన్ను ముట్టిన - అంతులేని వేదన నాకు కల్గిన
గర్జించు సింహము - ఎదురువచ్చిన
యేసు ప్రభువు మనతోనుండ - భయములేదుగా - 2 ||భయము ||
Verse 4
శత్రువున్ చూచి - విస్మయమొందకు
నీతోకూడ వచ్చువాడు - నీ దేవుడే - నిన్ను విడువడెన్నడు - ఎడబాయడు
యేసు ప్రభువు మనతోనుండ - భయములేదుగా - 2 ||భయము ||