Verse 1
అన్ని వేళలందు మాకు ఆశ్రయ దుర్గము నీవే
మా ఆత్మకు అనుదిన జీవాహారం జీవజలము నీవే
నీవులేని జీవితం శూన్యం యేసయ్యా
నిన్ను కలిగిన జీవనం ధన్యం యేసయ్యా - 2
Verse 2
మా దోషము నంతయు నిలువున భరియించితివి
మా శాపము నంతయు సిలువలో సహియించితివి
చీకటినిండిన బ్రతుకులలో జీవపు వెలుగును నింపితివి
సజీవసాక్షులుగా నీ పనికై యిల నిలిపితివి
నీ ప్రేమే మధురం - నీ కృపయే నిరతం - నీ సిలువే శరణం ||అన్ని ||
Verse 3
రక్షణ భాగ్యమును నిత్యము నిలిచే స్వాస్థ్యముగా
సంరక్షించుకునే సహనము శాంతము మాకిమ్ము
విశ్వాస పరీక్షలన్నిటిలో విశిష్టవిజయము వరించగా
విరిగిన హృదయముతో నీ సన్నిధిచేరి వేడెదము ||నీ ప్రేమే ||
Verse 4
సర్వము నీవని సదయుడ నీవని సతతము నిన్నే సన్నుతించి
అమరుడ నీవని ఆశతోచేరి ఆత్మతో ఆరాధించెదము