Verse 1
ఎక్కడికి పోదును - నేనెక్కడికి పోదును
నీవే నిత్యజీవపు మాటలు గలవాడని యెరిగి
అయ్యా! ........... నా యేసయ్యా...........
Verse 2
నీ జీవ వాక్యమే - నా శోధనలో జయమిస్తుందని యెరిగి
లోకమువైపు - నరులవైపు - శోకమువైపు - ధనమువైపు
చూచి చూచి - వేచి వేచి - విఫలమైతిమి ||ఎక్కడికి ||
Verse 3
నీ జ్ఞాన వాక్యమే - నా అవివేకతలో - తెలివినిచ్చునని ఎరిగి
రచనల వైపు - రాశులవైపు - తిధులవైపు - తారలవైపు
చూచి చూచి - వేచి వేచి - విసిగిపోతిమి ||ఎక్కడికి ||
Verse 4
నీ దివ్యవాక్యమే - నా చీకటిలో వెలుగిస్తుందని ఎరిగి
శాస్త్రము వైపూ - సిరుల వైపు - ఆస్తుల వైపూ - అన్నిటి వైపు
చూచి చూచి - వేచి వేచి - విఫలమైతిమి
చివరికీ నీ వాక్కునే ఆశ్రయించితిమీ ||ఎక్కడికి ||