Verse 1
ప్రణుతులివే - ప్రణుతులివే - ప్రభువా అందుకొనగ రావా
పూజలివే - పూజలివే - దేవా ఫలము లియ్యరావా
నీ ప్రేమ వరము లీయరావా || ప్రణుతులివే ||
Verse 2
మౌనముగా నిన్ను మనసారా ధ్యానించినా
తృప్తినాకు కలుగును - ముక్తి నాకు దొరుకును
నీ పూజారాధనలే కలిమి బలిమిలగును ||ప్రణుతులివే ||
Verse 3
వడివడిగా నీ లోగిలిలో అడుగిడునంతనే
దుఃఖము నాకు తొలగును మోదము నాకు మిగులును
నీ దివ్యారాధనలే కలిమి బలిమిలగును ||ప్రణుతులివే ||