Verse 1
నేనున్న స్థితిలోనే - సంతృప్తిని కలిగించు
ఏమున్న లేకున్న - నీ కొరకే బ్రతికించు
Verse 2
లోకములో నీకొరకు - జ్యోతిగ నను వెలిగించు
రెండవ రాకడ వరకు - విడువక నను నడిపించు ||నేనున్న ||
Verse 3
నా దినముల పరిమాణం - లెక్కించుట నేర్పించు
నాలోపల స్థిర హృదయం - నూతనముగ పుట్టించు ||నేనున్న ||
Verse 4
సరియగు త్రోవను నడువ కట్టడలను బోధించు
సమయోచిత జ్ఞానముతో దయచేసి దీవించు ||నేనున్న ||
Verse 5
కష్టాలు ఎదురైనా - నాయాత్రను సాగించు
నష్టాలలోనైనా - స్తుతిచేయుట నేర్పించు