Verse 1
నీ సన్నిధియే నాకు తోడురాగా - నా చేయి పట్టినన్ను నడిపించుము
నీ సన్నిధియే నాకు తోడు వచ్చిన - మదికి నెమ్మది విశ్రాంతి కలుగును
Verse 2
ఐశ్వర్యము ఘనత జీవము నీవే
ఆత్మల రక్షణ కార్యం అదియు నీవే
నా ఆశ్రయ దుర్గమా నా రక్షణ శృంగమా
నీ ఆత్మ క్రియను నాలో జరిగించుము ||ఆరాధింతును ||
Verse 3
నా ప్రార్ధనలన్నియు సఫలపరచు ఏసువా (యెహోవా)
నీ దక్షిణ హస్తముతో పదిలపరచుము
నా పెదవుల పలుకులు నా హృదయ ధ్యానము
నీ దివ్య మహిమలో అంగీకరించుము ||ఆరాధింతును ||
Verse 4
పాపిని పరిశుద్ధునిగా మార్చువాడవు
శత్రువును స్నేహితునిగా చేయు ఘనుడవు
కీడును మేలుగ మార్చే మహోన్నతుడవు నీవు
నీ స్వాస్థ్యమైన సంఘమును వృద్ధి చేయుము ||నీసన్నిధియే ||
Verse 5
ఆరాధింతును ఆనందింతును
మహిమ చూపుము ప్రభు కనికరించుము
ఆరాధన ఆనందమే ||4||