Verse 1
నీ మహిమ కొరకు నిత్యము నన్ను
వాడుకోవయ్యా యేసు - వాడుకోవయ్యా
నిను వేడుచున్నాను పరిశుద్ధాత్ముడా - శక్తినీయుమయా
Verse 2
నోవహు పంపిన పావురమువలే వాడుకోవయ్యా
ఏలియకాహారం తెచ్చిన కాకిలా నను వాడుకోవయ్యా
వాడుకోవయ్యా - నన్ను వాడుకోవయ్యా ||నీ మహిమ కొరకు ||
Verse 3
యోనాను నీనెవేకు చేర్చిన చేపలా వాడుకోవయ్యా
యేసును మోసిన గార్ధభమువలే నను వాడుకోవయ్యా
వాడుకోవయ్యా నన్ను వాడుకోవయ్యా ||నీ మహిమ కొరకు ||