Verse 1
సువార్త సునాదము వినిపించుటయే
యెంతో ధన్యత మాకిలలో
సువార్త ప్రకటన చేయుటయందు
సిగ్గుపడువారము కానే కాము -2
Verse 2
ఇలలో ఆస్థులు అతిశయం కాదు - క్రీస్తును కలిగిన అతిశయం మాకు
దేవుని కొరకై జీవించెదము - జీవమార్గములొ సాగెదమిలలో -2 ||సువార్త ||
Verse 3
కష్టములెన్నైన ఎదిరించెదము - నష్టములెన్నైన భరియించెదము
శోధనలెన్నైన ప్రార్థించెదము - ఓర్పుతొ దేవుని స్తుతియించెదము -2 ||సువార్త ||