Verse 1
నాకొకరు ఉన్నారు - నను ప్రేమించేవారు
పాపములో దాగియుండ - కరుణతో నను వెదకెను
Verse 2
అడవిలోని గొఱ్ఱెవలె - గురితప్పి తిరిగితిని
కాపరియై వెదకవచ్చి - తన ఒడి చేర్చుకొనెన్
ఆయనే యేసు - ఆయనే యేసు ||నాకొకరు ||
Verse 3
నన్నెరిగి నను పిలువ - నా రాజని యెరిగితిని
పరమున ననుచేర్చున్ - పరిశుద్ధునిగ మార్చున్
ఆయనే యేసు - ఆయనే యేసు ||నాకొకరు ||