Verse 1
ఔన్నత్యుడా కృపగల యేసయ్యా
నీనామమే ఉన్నతమైనది ||2||
కోరదగినదియే నీనామము
స్తుతియింపదగినదియే నీనామము ||2||
Verse 2
ఆకాశమందైన భూమి యందైనను ఏనామమున లేనేలేదు రక్షణ
నీ నామము వలన విమోచన పరమునకు నడిపించును నీ నామము
స్తుతి పాత్రుడా నా యేసయ్యా ||ఔన్న ||
Verse 3
నీ నామమున ప్రార్థించగానే గగనము నుండి అగ్నిని పంపితివి
వ్యాధిబాధలను తొలగించు నామం శత్రువుపై జయమిచ్చును నీనామము
క్షేమము నిచ్చున్ నా యేసయ్యా ||ఔన్న ||
Verse 4
దాగోనుదేవత నీమందసము ఎదుట
నిలువలేక పోయెనె కుప్పకూలిపోయెనే
అన్నినామములకన్న పై నామము
ఘనపరచదగినదియె నీ నామము
మందసమా నా యేసయ్యా ||ఔన్న ||