Verse 1
రండీ రండీ సాతాను కోటను చుట్టెదము
చుట్టిన కోటను స్తుతుల శక్తితో కూల్చెదము - 2
మొదటిరోజుకాకపోని - రెండోరోజుకాకపోనీ - మూడోరోజు కూలిపోవును
స్తుతించగా, స్తుతించగా స్తుతుల శక్తితో కుప్పకూలును
Verse 2
యెరికోను చుట్టిన ఇశ్రాయేలును చూడుడి
అందరూ కలిసి స్తుతించగా కోట కూలిపోయెను
మరి మనము కూడా కలిసి పాడెదమా - కోటలను కూల్చెదమా ||రండీ ||
Verse 3
చెరసాలలోని పౌలును చూడుడి
సీలతో కలిసి స్తుతించగా చెరసాల కూలిపోయెను
మరి మనము కూడా కలిసి పాడెదమా - బంధకాలను త్రెంచెదమా ||రండీ ||
Verse 4
బబులోనులోని దానియేలును చూడుడి
మిత్రులతో కలిసి స్తుతించగా మర్మం బయలు పరచెను
మరి మనము కూడా కలిసి పాడెదమా - అద్భుతాలను చూపెదమా ||రండీ ||