Verse 1
ఎన్ని తరములు స్తుతియించినా (2)
తీరునా నీ ఋణం (4)
నా ప్రాణము – నా జీవము (2)
నీవే నా యేసయ్యా
నీవే నా మెస్సయ్యా ||ఎన్ని||
Verse 2
కరిగిపోని కన్నీరెంతో
కుమ్మరించాను – కుమ్మరించాను (2)
కరుణామయుడా కన్నులు తుడిచి (2)
(నీ) కృపను చూపావు – కృపను చూపావు (2) ||నా ప్రాణము||
Verse 3
పాపములోనే పుట్టిన వారిని
పరిశుద్ధపరచితివి – పరిశుద్ధపరచితివి (2)
పరమ తండ్రి పవిత్రతతోనే (2)
(నీ) పరమున చేర్చెదవు – పరమున చేర్చెదవు (2) ||నా ప్రాణము||