Verse 1
పండుగ ఉత్సాహమే నా యేసుని సన్నిధిలో
ఆనందమానందమే నాయేసుని సన్నిధిలో || పండుగ ||
Verse 2
పాపమంత పోయింది వ్యాధి అంత తొలగింది యేసుని రక్తములో
క్రీస్తులో జీవము కృపలో రక్షణ పరిశుద్ధాత్మలో ||పండుగ ||
Verse 3
భువిలో జన్మించి - మనకొరకై మరణించెను
అద్భుతకరుడేసు - ఆశ్చర్యకరుడేసు - అద్భుతములెన్నో చేసెను ||పండుగ ||
Verse 4
శక్తివంతుడేసు - జీవించు యేసు జయం పైన జయమిచ్చును
ఏకంగకూడి - హోసన్న పాడి ఊరంత చాటెదము ||పండుగ ||