Verse 1
సర్వేంద్రియానాం నయనం ప్రధానం
నిను చూడ కనులీయుమా దేవా - నిను పాడ స్వరమీయుమా|
Verse 2
వ్యర్ధ క్రియలను దృష్టించకను నా కన్నులను త్రిప్పివేయుము
నా యజమానుడ నీవైపు చూచి - విజయము పొందగ నిజబలమిమ్మూ ||నిను ||
Verse 3
అగ్నియే నాలుక నా శరీరమున - మరణకరమగు విషము నిండినది
చేదు మాటల నాదునోటిని - జీవధారల ఊటగ జేయుము ||నిను ||
Verse 4
అంతరంగమున ఆలోచన - నాశనకరమైన వేదన
మోసపోతిని దోషినైతిని - దాసుని చేకొని శుద్ధీకరించుము ||నిను ||