Verse 1
నీకృప మాకు చాలునయ్యా - 2 - ఎల్లప్పుడు మా యేసయ్యా - 2
Verse 2
భూతలమంతయు మహిమతో నిండెను
భువనేశ్వరుడవు నీవేగా - 2
కనికరపూర్ణుడా కరుణామయుడా - 2
సత్యసంపూర్ణుడా మృత్యుంజుయుడా - 2 ||నీకృప ||
Verse 3
కృప తిని బ్రతికే అల్పజీవులము
కృప లేక ఇల జీవించలేము - 2
కృప మా జీవపు మూలాధారము - 2
కృపతో నింపుము నిరతము మమ్ము - 2 ||నీకృప ||