Verse 1
నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా నీతిమంతుడు
శక్తిమంతుడు - యదార్ధవంతుడు (2)
అనుదినం ప్రభువునే ప్రసిద్ధి చేసెదన్ || నాకు ||
Verse 2
బాల్యమందు నేను భంగపడను - యౌవ్వనమందు నేను తొట్రిల్లను (2)
వృద్ధాప్యమందు నేను వ్యసనపడను (2)
అనుదినం ప్రభువునే ప్రసిద్ధి చేసెదన్ ||నాకు ||
Verse 3
ఎర్రసముద్రాలొచ్చి అలలు రేపినా
గొల్యాతులు బలముగా ఎదురువచ్చినా (2)
ఎదురునిలిచి ఖడ్గముతో చీల్చివేసెదన్ (2)
అనుదినం ప్రభువునే ప్రసిద్ధి చేసెదన్ ||నాకు ||
Verse 4
సాతాను బాణాలను విరిచివేసెదన్
యేసయ్య వాక్యముతో బలము పొందెదన్ (2)
ఆత్మశక్తితోనే అనుదినము నిలిచెదన్ (2)
అనుదినం ప్రభువునే ప్రసిద్ధి చేసెదన్ ||నాకు ||