Verse 1
నేను నమ్మిన నా యేసుని ఎరుగుదును
నేను నమ్మిన నా దేవుని ఎరుగుదును
Verse 2
సకల దేవతల కన్న తానే గొప్పవాడని
సర్వోన్నతుడు సృష్టికర్త తానని
అద్వితీయ సత్యదేవుడు నాదు విమోచకుడు
నిత్యము సజీవుడేనని ఎరుగుదును ||కలత ||
Verse 3
సింహాల నోళ్ళనే మూయించువాడు
అగ్నిజ్వాలలయందు నడిపించువాడు
సంద్రము చీల్చి మన్నాను కురిపించి
అద్భుతములు చేయువాడని ఎరుగుదును ||కలత ||
Verse 4
దీనదరిద్రులకు బాధితులెల్లరికి
అండగ తానిలచి న్యాయము తీర్చును
ఎంతో ప్రేమించి చింతలన్నియు తీర్చి
చెంతనుండు వాడు తానని ఎరుగుదును ||కలత ||
Verse 5
నన్ను పిలచుకున్నవాడు నమ్మదగినవాడని
ఎట్టి శ్రమలలోనైన నన్ను విడిపోడని
అప్పగించిన పనిని తప్పక కాపాడి
గొప్ప విజయ మిచ్చువాడని ఎరుగుదును ||కలత ||
Verse 6
కలత చెందను - సిగ్గునొందను
నేనమ్మిన యేసుని - ఎరుగుదును