Verse 1
నాకు బదులుగా శాపమును - నా స్థానములో మరణమును
కసాయి చేతిలో గొఱ్ఱెలా మెౌనముగా భరియించితివా
Verse 2
నన్ను విమోచించాలని - నీవు బంధింపబడితివి
నాకు ఆనందమివ్వగా - నీవు హింసింప బడితివి
నన్ను ఓదార్చగా - నీవు వేదననొందితివి ||ఏ ఘడియా ||
Verse 3
నన్ను సేద దీర్చాలని - నీవు శిక్షింపబడితివి
నాకు అమరత్వమివ్వగా - నీవు బాధించబడితివి
నన్ను బలపరచగా - నీవు ప్రాణము విడిచితివి ||ఏ ఘడియా ||
Verse 4
ఏ ఘడియ విసుగు చెందక - తండ్రి చిత్తమును చేసి చూపిన
లోక మానవ దోష హారక - యేకైక రక్షక - మా యేసు రక్షక