Verse 1
చీకటి కాలము వచ్చుచుండె - కృప కాలము నుపయోగించు
తలుపులు తెరచి - యుండగనే విరిగిన మనసుతో సాగెదవా
Verse 2
బీడు భూములధికముగా - చూచిన నీవు సాగిరా
యేసును వారికి చూపించు - ప్రేమ సువార్తను చాటించు ||చీకటి ||
Verse 3
ఎన్నో రాజ్యములీనాడు - దేవుని పనికి మూయబడే
తెరచిన తలుపులు ఎదురుండన్ - ప్రవేశింతురు జ్ఞానులు ||చీకటి ||
Verse 4
విశ్వాసుల సహవాసమున - ప్రేమైక్యత గలదని
చెప్పెడి దినములు - మనమధ్యకు రావలెను ||చీకటి ||
Verse 5
మాదు హృదయముల నింపు - నీదుప్రేమతో మా ప్రభువా
హిందూ దేశపు వీధులలో - నాధా నిన్నే చాటెదము ||చీకటి ||
Verse 6
ఆ తలుపులు తెరచియుండగనే - విరిగిన మనసుతో సాగెదవా
కాలమపాయముగానుండె - సమయము సద్వినియోగించు