Verse 1
భయాలలో అభయమునిచ్చే దయామయా
మా జయాలకు మూలము నీవే మా యేసయ్యా
నీవే నీవే నీవే నీవే మాకు ఆనంద కారణము
నీకే నీకే నీకే నీకే స్తుతులతో సింహాసనము
Verse 2
నీ భజనే ఆధారము - స్తుతిలేక బ్రతుకజాలము
నీ స్మరణే మా సర్వము - మాకదియే శోభస్కరము
అందుకొనుము మా వందనము-అందించుము నీ రక్షణము ||భయాలలో ||
Verse 3
నీ నామమే ఆశ్రయము పొగడకుండా ఉండలేము
నీ సన్నిధే ఉత్తమము - మోకరిల్లక ఆగలేము
ఆలకించుమీ నినాదము - అందించుము నీ వివేకము ||భయాలలో ||
Verse 4
నీ శిలువే శరణ్యము ఆ దారిని విడువలేము
నీ పలుకే ఆచరణము అంతము వరకు పాటించెదము
ధ్యానింతుము నీ సునాదము - పఠియింతుము నీ లేఖనము ||భయాలలో ||