Verse 1
నా యేసుని ప్రేమకన్న మిన్నయేమున్నది - ఆ ప్రేమ కల్వరిగిరిలో సార్ధకంబైనది
Verse 2
నీదు ప్రేమే నాకు జీవం - నా సమస్తమును
వర్ణింపగలనా నీదు ప్రేమ - ప్రాణప్రియుడా ||నా ||
Verse 3
నీవు పొందిన శ్రమలన్నియును - నాదుడెందములో
సాక్ష్యమిచ్చుచుండ నేను - నిన్ను విడుతునా ||నా ||
Verse 4
నీవు కార్చిన రక్తమే - నా ముక్తిమార్గమై
సిల్వలో స్రవించుచు నన్ - శుద్ధి చేయును ||నా ||
Verse 5
అర్పింతును నే నా సమస్తము - నాదు హృదయమును
నీదు ప్రేమ నన్ను తొందర - చేయుచున్నది ||నా ||