Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Chaachina Chethulu Neeve

చాచిన చేతులు నీవే

Chaachina Chethulu Neeve

Chorus
చాచిన చేతులు నీవే
అరచేతిలో చెక్కినావే
కమ్మని అమ్మవు నీవే
కాచిన తండ్రివి నీవే
నీలా ఎవరు ప్రేమిస్తారు
నాకై ప్రాణం అర్పిస్తారు
కన్నీళ్లు తుడిచి కరుణిస్తారు
కళ్ళార్పకుండా కాపాడతారు‖ చాచిన ‖
Verse
కొండలు గుట్టలు చీకటి దారులు
కనిపించదే కళ్ళు చిట్లించినా
కారాలు మిరియాలు నూరేటి ప్రజలు
అన్నారు పడతావొక్క అడుగేసినా
రక్షించే వారే లేరని
నీ పనైపోయిందని‖ 2x ‖
అందరు ఒక్కటై అరచేసినా
అపవాదులెన్నో నాపై మోపేసినా‖ 2x ‖
నీ చేయి చాచేసి చీకటిని చీల్చేసి
శత్రువును కూల్చేసి నిలబెట్టినావు‖ చాచిన ‖
Verse
పేదోడు పిరికోడు ప్రభు సేవకొచ్చాడు
అవమానపడతాడని నవ్వేసినా
చిన్నోడు నీవంటూ అర్హత లేదంటూ
అయినోళ్లు కానోళ్లు చెప్పేసినా
నీవెంత నీ బ్రతుకెంతని
నిలువలేవు నీవని‖ 2x ‖
అందరు ఒక్కటై తేల్చేసినా
కూల్చేయాలని నన్ను కృషిచేసినా‖ 2x ‖
నీ ఆత్మతో నింపేసి నిరాశను కూల్చేసి
నా గిన్నె నింపేసి నడిపించినావు‖ చాచిన ‖

Related Tags

ComfortProtectionGods Love